వైభవంగా శ్రీనృసింహేష్టి హోమం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమి-పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.

Published : 26 Mar 2023 03:23 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమి-పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం శ్రీరామధర్మ ప్రచార రథం వేదిక వద్ద శ్రీనృసింహేష్టి హోమం నిర్వహించారు. శ్రీరామాయణ మహాక్రతువులో భాగంగా నూతన యాగశాలల వద్ద నాలుగు వేదాలతోపాటు శ్రీరామ షడక్షరీ మంత్ర హోమాలు నిర్వహించారు. 30న శ్రీరామనవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించేవారు సెక్టార్‌ టికెట్లను భద్రాచలం, కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో తీసుకోవచ్చని ఈవో రమాదేవి తెలిపారు. దూరప్రాంతాలకు చెందినవారు bhadrachalamonline.com వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు