నవీన్‌ కుటుంబంలో ఒకరికి పొరుగుసేవల కింద ఉద్యోగం

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో నవీన్‌ కుటుంబంలో ఒకరికి పొరుగుసేవల విధానంలో ఉద్యోగం కల్పించారు. ఉద్యోగం దొరకడం లేదనే ఆవేదనతో సిరిసిల్లలోని బీవైనగర్‌కు చెందిన చిటికెన నవీన్‌ ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Published : 26 Mar 2023 03:23 IST

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో నియామక పత్రం అందజేత

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో నవీన్‌ కుటుంబంలో ఒకరికి పొరుగుసేవల విధానంలో ఉద్యోగం కల్పించారు. ఉద్యోగం దొరకడం లేదనే ఆవేదనతో సిరిసిల్లలోని బీవైనగర్‌కు చెందిన చిటికెన నవీన్‌ ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించి నవీన్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరికి పొరుగుసేవల కింద ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి ఆదేశాలతో నవీన్‌ రెండో సోదరుడికి జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉద్యోగ అవకాశాన్ని కల్పించారు. శనివారం భారాస రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య.. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు సంబంధిత నియామక పత్రాన్ని అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని