పరిపాలనలో నవీన సాంకేతికత

పరిపాలనలో నవీన సాంకేతికతల వినియోగానికి గాను ఉత్తమ ప్రతిభా రాష్ట్రంగా తెలంగాణ.. కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా జాతీయ అవార్డుకు ఎంపికైంది.

Updated : 26 Mar 2023 05:07 IST

తెలంగాణకు కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అవార్డు
టీచిట్స్‌ ప్రాజెక్టుకు ప్రత్యేక పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: పరిపాలనలో నవీన సాంకేతికతల వినియోగానికి గాను ఉత్తమ ప్రతిభా రాష్ట్రంగా తెలంగాణ.. కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా జాతీయ అవార్డుకు ఎంపికైంది. టీచిట్స్‌ పేరిట రూపొందించిన ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రశంస పురస్కారం లభించింది. శనివారం దిల్లీలోని సాంకేతిక విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నవీన సాంకేతికతల విభాగం సంచాలకురాలు ఎల్‌.రమాదేవి, ఐటీ విభాగాధిపతి రుషితలకు నిర్వాహకులు ప్రదానం చేశారు. రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కడంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ‘‘పరిపాలనలో ప్రజలకు సత్వర సేవలందించేందుకు నవీన సాంకేతికతల వినియోగం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశాం. దీనిద్వారా పౌరసేవలు మెరుగుపడ్డాయి. చిట్‌ఫండ్‌ సంస్థల సేవల క్రమబద్ధీకరణ, పారదర్శకత కోసం రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ద్వారా టీచిట్స్‌ పేరిట ప్రాజెక్టును అమలుచేస్తున్నాం. దీనికి ప్రత్యేక పురస్కారం లభించడం ఆనందంగా ఉంది. వివిధ రంగాల్లో అత్యాధునిక సాంకేతికతల వినియోగంలో రాష్ట్రప్రభుత్వం ముందుంది’’ అని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి పురస్కారాలు దక్కడంపై పరిశ్రమలు, ఐటీశాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ కూడా హర్షం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు