వారాల ఆనంద్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార ప్రదానం

కరీంనగర్‌కు చెందిన సినీ విమర్శకులు, రచయిత వారాల ఆనంద్‌ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ కవి గుల్జార్‌ రాసిన గ్రీన్‌ పోయెమ్స్‌ కవితా సంకలనాన్ని తెలుగులో ఆకుపచ్చ కవితల పేరుతో అనువదించిన ఆయనకు మూడు నెలల కిందట కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో అవార్డు ప్రకటించారు.

Published : 26 Mar 2023 03:23 IST

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: కరీంనగర్‌కు చెందిన సినీ విమర్శకులు, రచయిత వారాల ఆనంద్‌ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ కవి గుల్జార్‌ రాసిన గ్రీన్‌ పోయెమ్స్‌ కవితా సంకలనాన్ని తెలుగులో ఆకుపచ్చ కవితల పేరుతో అనువదించిన ఆయనకు మూడు నెలల కిందట కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో అవార్డు ప్రకటించారు. గోవా రాష్ట్రం పనాజీలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌ చేతుల మీదుగా వారాల ఆనంద్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దీని కింద రూ.50 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు. కొంకణి రచయిత, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత దామోజర్‌ మౌజో, అకాడమీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కుముద్‌ శర్మ, కార్యదర్శి కె.శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారని ఆనంద్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు