ఏప్రిల్‌ 3 నుంచి పది పరీక్షలు

వచ్చే నెల 3 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ శనివారం ప్రకటించింది.

Updated : 26 Mar 2023 05:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే నెల 3 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ శనివారం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,652 కేంద్రాలలో 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వారిలో 4,85,826 మంది రెగ్యులర్‌ విద్యార్థులు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. ఈ ఏడాది 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హాల్‌టికెట్లను ఆయా పాఠశాలలకు పంపించామని, అలాగే www.bse.telangana.gov.in లోనూ వాటిని అందుబాటులో ఉంచినట్లు బోర్డు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని