అంబేడ్కర్‌ విగ్రహం పనులు 10లోగా పూర్తికావాలి: సీఎస్‌

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరంలో చేపట్టిన 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం పనులన్నీ ఏప్రిల్‌ 10వ తేదీలోగా పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారి ఆదేశించారు.

Published : 26 Mar 2023 03:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరంలో చేపట్టిన 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం పనులన్నీ ఏప్రిల్‌ 10వ తేదీలోగా పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారి ఆదేశించారు. శనివారం ఆమె విగ్రహం పనులు జరుగుతున్న తీరును, ల్యాండ్‌ స్కేపింగ్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ... ‘రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఆయన జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 14న ఆవిష్కరించనుంది. ఈమేరకు అన్ని పనులను 10వ తేదీలోగా పూర్తి చేయాలి’ అని స్పష్టంచేశారు. రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్‌సీ గణపతిరెడ్డి తదితరులు పనుల పురోగతిని సీఎస్‌కు వివరించారు. ఈ సందర్భంగా విగ్రహం, దాని పరిసరాల నమూనా చిత్రాన్ని ఆమెకు చూపారు. అనంతరం రాష్ట్ర సచివాలయ పనులను సైతం సీఎస్‌ పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని