జలాశయాల ఆనకట్టల పరిస్థితి ఏంటి
రాష్ట్రంలో ఉన్న భారీ, మధ్యతరహా జలాశయాల ఆనకట్టల భద్రతపై రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌డీఎస్‌ఓ) ఇంజినీర్లను అప్రమత్తం చేసింది.
ఏప్రిల్ 15లోగా సమగ్ర నివేదిక పంపండి
రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న భారీ, మధ్యతరహా జలాశయాల ఆనకట్టల భద్రతపై రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌డీఎస్‌ఓ) ఇంజినీర్లను అప్రమత్తం చేసింది. ఇప్పటివరకు డ్యాం సేఫ్టీ చట్టం పరిధిలో ఉన్న 184 ఆనకట్టలకు సంబంధించి సమగ్ర వివరాలను అందజేయాలని సూచించింది. ఏటా వర్షాకాలానికి ముందు, తరువాత ఈ సంస్థ ఆనకట్టల భద్రతపై సమీక్ష నిర్వహిస్తుంది. ఇందులోభాగంగా వచ్చే వర్షాకాలంలోపు ఆనకట్టల భద్రతకు డ్యాం సేఫ్టీ ప్రమాణాల మేరకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై నివేదికలు సిద్ధం చేయాలంది. ఏప్రిల్ 15లోపు డ్యాం బాధ్యులు ఈ మేరకు స్పందించాలని ఆదేశించింది.
మరమ్మతులు.. నిర్వహణ
ఆనకట్టల భద్రతలో ప్రధానంగా నిర్వహణలోపాలు ఉంటున్నాయి. ప్రాథమిక స్థాయిలోనే వాటిని సరిచేయడం ద్వారా పెద్ద సమస్యలుగా మారకుండా నిరోధించడానికి వీలుంటుంది. దీనికోసం ఏడాది కిందట రూపొందించిన డ్యాం సేఫ్టీ చట్టంలో భాగంగా ప్రాజెక్టు స్థాయిని బట్టి ఈఈ నుంచి సీఈ వరకు బాధ్యతలు అప్పగించారు. ఆనకట్ట గేట్లు, స్పిల్‌వే, బకెట్ వ్యవస్థ, మోటార్ల నిర్వహణ, జనరేటర్ల పనితీరు సరిచేయడం, మరమ్మతులు తదితరాలను సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యతలను ఇంజినీర్లకు అప్పగించారు. దీనికోసం ఓ అండ్ ఎం విభాగం కేటాయించిన అత్యవసర నిధులు వినియోగించుకునే వెసులుబాటు ఉంది. పెద్ద సమస్యలు గుర్తించినట్లయితే ఎస్‌డీఎస్‌ఓ నేతృత్వంలో నిపుణుల బృందం డ్యాంను సందర్శించి తగు సూచనలు అందజేస్తుంది. దీనిలో భాగంగా కీలకమైన జలాశయాల ఆనకట్టల నిర్వహణపై ప్రస్తుతం ఇంజినీర్లు కసరత్తు ప్రారంభించారు. వీటిలోకి వరద నీటిప్రవాహం ప్రారంభమయ్యేలోపు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలనేది లక్ష్యమని ఎస్‌డీఎస్‌ఓ ఇంజినీర్లు పేర్కొంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Sujana chowdary: భాజపా అధిష్ఠానంతో పవన్ చర్చలు జరిపారు: సుజనా చౌదరి
-
Crime News
Hyderabad: ఈతకు దిగి వ్యక్తి మృతి.. మునిగిపోతున్న దృశ్యాలు వైరల్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Sarath chandra reddy: దిల్లీ మద్యం కేసు.. అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి
-
Sports News
AUS vs IND: ఆసీస్‌కు ఎక్కువగా వారిద్దరి గురించే ఆందోళన : రికీ పాంటింగ్
-
India News
Manipur Violence: ‘వెంటనే ఆయుధాలు అప్పగించండి.. లేదో’: అమిత్ షా గట్టి వార్నింగ్