లండన్‌లో స్టడీటూర్‌కు తెలంగాణ విద్యార్థినులు

తెలంగాణ ప్రభుత్వం, బ్రిటిష్‌ కౌన్సిల్‌ల మధ్య ఒప్పందం మేరకు రాష్ట్రంలోని 15 మంది ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థినులు స్టడీ టూర్‌ కోసం ఆదివారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌ బయల్దేరి వెళ్లారు.

Published : 27 Mar 2023 03:18 IST

ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి 15 మంది ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం, బ్రిటిష్‌ కౌన్సిల్‌ల మధ్య ఒప్పందం మేరకు రాష్ట్రంలోని 15 మంది ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థినులు స్టడీ టూర్‌ కోసం ఆదివారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌ బయల్దేరి వెళ్లారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి అయిదుగురు, సాంఘిక సంక్షేమ శాఖ కళాశాలల నుంచి ఆరుగురు, గిరిజన సంక్షేమ శాఖ కళాశాలల నుంచి నలుగురు ఈ బృందంలో ఉన్నారు. వచ్చే నెల 8 వరకు ఈ స్టడీ టూర్‌ కొనసాగుతుంది. తమకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రులు సబితారెడ్డి, సత్యవతి, కొప్పుల ఈశ్వర్‌, కళాశాల విద్యాకమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌కు ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు