విద్యుత్‌ ఛార్జీల పెంపు ఆర్థిక ద్రోహమే

రోజులో గరిష్ఠ డిమాండ్‌ సమయంలో విద్యుత్‌ ఛార్జీలను 10 నుంచి 20 శాతం పెంచాలని కేంద్రం ప్రతిపాదించడం ఆర్థిక ద్రోహమేనని ఆ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 27 Mar 2023 03:18 IST

మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: రోజులో గరిష్ఠ డిమాండ్‌ సమయంలో విద్యుత్‌ ఛార్జీలను 10 నుంచి 20 శాతం పెంచాలని కేంద్రం ప్రతిపాదించడం ఆర్థిక ద్రోహమేనని ఆ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలపై భారం మోపే విధానాలను ఒప్పుకొనే ప్రసక్తే లేదని చెప్పారు. ట్రూఅప్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రం తాఖీదులు జారీ చేస్తే పాటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టంచేశారు. 2014 ఎన్నికల ప్రచారంలో.. అధికారంలోకి వస్తే దేశంలో విద్యుత్‌ కాంతులు ప్రసరింపజేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ.. ప్రస్తుతం కరెంట్‌ వినియోగానికి పేదలను దూరంచేసే కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. పేదలకు రాయితీలు ఎత్తివేసేందుకు భాజపా ప్రభుత్వం రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసిందని విమర్శించారు. జేబులకు చిల్లులు పెట్టడం.. ప్రజలను చీకట్లోకి నెట్టడమే కేంద్ర ప్రభుత్వ ఆలోచనని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని