జీపీఎస్‌ ఆధారంగా టోల్‌ వసూలుకు కసరత్తు

టోల్‌ వసూలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు జీపీఎస్‌ ఆధారిత విధానాన్ని తీసుకురావాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించగా ప్రయోగాత్మకంగా అమలు చేసే టోల్‌ప్లాజాల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు స్థానం ఉందా? లేదా? అనేది తేలడంలేదు.

Published : 27 Mar 2023 03:18 IST

జాబితాలో తెలుగు రాష్ట్రాల ప్లాజాలపై సందిగ్ధం!

ఈనాడు, హైదరాబాద్‌: టోల్‌ వసూలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు జీపీఎస్‌ ఆధారిత విధానాన్ని తీసుకురావాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించగా ప్రయోగాత్మకంగా అమలు చేసే టోల్‌ప్లాజాల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు స్థానం ఉందా? లేదా? అనేది తేలడంలేదు. ఆర్నెల్లలో కొత్త విధానం తెస్తున్నట్టు ఈ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. జాతీయ రహదారులపై తెలంగాణలో 39, ఆంధ్రప్రదేశ్‌లో 42 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) విధానంలో టోల్‌ వసూలు జరుగుతోంది. జీపీఎస్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించాక... దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ చెల్లించేందుకు ప్రతి వాహనం సాధారణ పరిస్థితుల్లో సగటున 50 సెకన్ల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. జీపీఎస్‌ను అనుసంధానం చేస్తే 25 నుంచి 30 సెకన్లలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని