ప్రైవేటు బస్సులకు దీటుగా టీఎస్‌ఆర్టీసీ సేవలు

ప్రైవేటు బస్సులకు దీటుగా టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు సేవలందిస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు.

Published : 28 Mar 2023 04:24 IST

మంత్రి పువ్వాడ
ఏసీ స్లీపర్‌ సర్వీసుల ప్రారంభం

ఎల్బీనగర్‌, న్యూస్‌టుడే- ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు బస్సులకు దీటుగా టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు సేవలందిస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో మొదటిసారి అందుబాటులోకి తెచ్చిన ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సులను హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌తో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ‘లహరి-అమ్మఒడి అనుభూతి’ పేరుతో మొత్తం 16 ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సులను తెస్తున్నామని, ఇందులో 9 సర్వీసులను ప్రస్తుతం ప్రారంభించామని తెలిపారు. ఇవి విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. ‘‘త్వరలో రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీకి 1300కుపైగా ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయి. డీలక్స్‌, సెమీ లగ్జరీ విభాగాల్లో 400కు పైగా బస్సులను ఇప్పటికే వివిధ డిపోలకు అందించాం. ఆక్యుపెన్సీ రేటు 69 శాతానికి చేరింది. దీన్ని 75 శాతానికి పెంచేందుకు కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో కండక్టర్‌ అవసరం లేకుండానే టికెట్‌ జారీకి బస్సుల్లో కొత్త సాంకేతికతను తెస్తాం’’ అని వివరించారు. ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. డ్రైవర్‌లు, కండక్టర్‌లు కష్టపడి పనిచేస్తున్నారని, సంస్థ నష్టాల నుంచి లాభాల్లోకి పయనించేలా కృషి చేస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

స్లీపర్‌ బస్సుల టికెట్‌ ధరలు ఇలా..

కర్ణాటక వైపు వెళ్లే ఏసీ స్లీపర్‌ బస్సుల టికెట్లపై 20 శాతం, ఇతర రాష్ట్రాలకు 15 శాతం రాయితీ ఇస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. సోమవారం రూట్ల వారీగా ప్రకటించిన టికెట్‌ ధరలు ఇలా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని