కనీస వేతనాల సవరణపై వివరణ ఇవ్వండి

కనీస వేతనాల సవరణకు సంబంధించి జీవోలు జారీ చేసినప్పటికీ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.

Updated : 28 Mar 2023 05:30 IST

ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: కనీస వేతనాల సవరణకు సంబంధించి జీవోలు జారీ చేసినప్పటికీ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. కనీస వేతనాల చట్టంలోని నిబంధనల ప్రకారం వేతనాలను సవరించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ రీజినల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌ తరఫున ప్రధాన కార్యదర్శి డి.సత్యం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సీహెచ్‌.ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ రాష్ట్రవ్యాపంగా ఉన్న సంఘటిత, అసంఘటిత కార్మికులకు కనీస వేతనాల పెంపుపై వివిధ ప్రభుత్వ శాఖలు జీవోలు జారీచేసినా వాటి అమలుకు గెజిట్‌ జారీ చేయలేదన్నారు. దీంతో వివిధ రంగాల్లోని కోటి మందికిపైగా కార్మికులు ప్రభుత్వ చర్యల వల్ల నష్టపోతున్నారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మికశాఖ కమిషనర్‌; ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్‌ 19వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు