శంషాబాద్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రి పనులు వెంటనే ప్రారంభించాలి: మంత్రి మల్లారెడ్డి

శంషాబాద్‌లో కొత్తగా నిర్మించతలపెట్టిన వంద పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెంటనే శంకుస్థాపన చేయాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు.

Published : 28 Mar 2023 04:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌లో కొత్తగా నిర్మించతలపెట్టిన వంద పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెంటనే శంకుస్థాపన చేయాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో సీటీ స్కానింగ్‌, ఎంఆర్‌ఐ సౌకర్యాల పనులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈఎస్‌ఐసీ ప్రాంతీయ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో ఈఎస్‌ఐసీ డిస్పెన్సరీ-బ్రాంచ్‌ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఈఎస్‌ఐసీ అధికారులు రేణుకప్రసాద్‌, ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు