ఓటర్ల నమోదు వెబ్‌సైట్‌ మార్పు

ఓటర్లకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెబ్‌సైట్‌ను మార్చినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 28 Mar 2023 04:24 IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఓటర్లకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెబ్‌సైట్‌ను మార్చినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు ఇక నుంచి  https://www.voters.eci. gov.in   వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని పౌరులకు సూచించారు. ‘‘ఓటరు నమోదుతోపాటు ఓటరు కార్డు కోసం దరఖాస్తు సమర్పణ, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సమాచారం, పోలింగు కేంద్రాల వివరాలు, ఓటరు నమోదు, పోలింగు కేంద్రం స్థాయి అధికారుల సమాచారంతోపాటు మరిన్ని సేవలు ఈ కొత్త వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇప్పటివరకు జాతీయ ఓటరు పోర్టల్‌ సర్వీస్‌(ఎన్‌వీఎస్‌పీ) ద్వారా సేవలు అందాయి. ఇక నుంచి ఆ పోర్టల్‌ పని చేయదు’’ అని వికాస్‌రాజ్‌ ఆ ప్రకటనలో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని