పాత పింఛన్‌ విధానం సాధనకు ఆగస్టు 23న మహాసభ: స్థితప్రజ్ఞ

పాత పింఛన్‌ విధానం లక్ష్య సాధనకు ఆగస్టు 23న హైదరాబాద్‌లో రాజకీయ రణరంగ మహాసభ, అక్టోబరు 1న దిల్లీలో పెన్షన్‌ శంఖ్‌నాద్‌ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పింఛన్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు.

Published : 28 Mar 2023 04:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: పాత పింఛన్‌ విధానం లక్ష్య సాధనకు ఆగస్టు 23న హైదరాబాద్‌లో రాజకీయ రణరంగ మహాసభ, అక్టోబరు 1న దిల్లీలో పెన్షన్‌ శంఖ్‌నాద్‌ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పింఛన్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. పాత పింఛన్‌ విధానం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే అంశంతో.. ఏప్రిల్‌ 16న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, మే నెలలో ‘సామాజిక భద్రత కోరుకునే ఉద్యోగి సామాజిక బాధ్యత నెరవేరుస్తాడు’ అనే నినాదంతో చలివేంద్రాల ఏర్పాటు, జూన్‌ రెండో వారంలో డివిజన్‌ వారీగా సదస్సులు, జులై మొదటి వారంలో రాష్ట్రమంతా బస్సుయాత్ర నిర్వహిస్తామని వివరించారు. సోమవారం ఇక్కడి సంఘం కార్యాలయంలో ఆయన అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర నాయకులు, 33 జిల్లా శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ కనీస పింఛన్‌ హామీ లేని మార్కెట్‌ ఆధారిత పెట్టుబడిదారీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసేవరకు విశ్రమించేది లేదని స్పష్టంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు