MLC Kavitha: కవిత సెల్‌ ఫోన్లలోని డేటా సేకరణ

దిల్లీ మద్యం కేసు విచారణలో భాగంగా భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెల్‌ఫోన్ల నుంచి ఈడీ అధికారులు డేటా సేకరించారు.

Updated : 29 Mar 2023 08:14 IST

హాజరైన సోమ భరత్‌

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసు విచారణలో భాగంగా భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెల్‌ఫోన్ల నుంచి ఈడీ అధికారులు డేటా సేకరించారు. అంతకుముందే దీనిపై కవితకు ఈడీ లేఖ రాసింది. ఫోన్లను తెరిచే సమయానికి కవిత లేక ఆమె ప్రతినిధి హాజరుకావాలని కోరింది. దీంతో కవిత తరఫున భారాస లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ మంగళవారం దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఉదయం 11.30కు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చారు. డేటా సేకరణ, సోమ భరత్‌ నుంచి కొంత సమాచారం సేకరించిన తర్వాత ఈడీ అధికారులు ఆయనను పంపించేశారు. సెల్‌ ఫోన్లు తెరిచే సమయంలో తాను ఉన్నానని, ఈడీ కార్యాలయంలో జరిగిన అంశాలను  మీడియాకు తెలపలేనని భరత్‌ చెప్పారు. 

ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ దురుద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ఆరోపణలు చేసిందన్న కవిత.. ఈ నెల 21న వాటిని తీసుకెళ్లి దర్యాప్తు సంస్థకు ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని