సాహిత్య కార్యక్రమాలతో ఉత్తేజం

సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడంవల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) వీసీ ఆచార్య డి.రవీందర్‌ అన్నారు.

Published : 29 Mar 2023 04:41 IST

తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం

నారాయణగూడ, న్యూస్‌టుడే: సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడంవల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) వీసీ ఆచార్య డి.రవీందర్‌ అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన కీర్తి పురస్కార ప్రదానోత్సవ సభలో ఆయన మాట్లాడారు. 2020 సంవత్సరానికి వివిధ రంగాల్లో నిష్ణాతులైన 22 మందికి మొదటివిడతగా పురస్కారాల ప్రదానం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ..కొవిడ్‌ పరిస్థితుల వల్ల మూడేళ్లుగానిలిచిపోయిన పురస్కారాలను అందజేస్తున్నామన్నారు.

పురస్కార గ్రహీతలు వీరే..

డా.ఎస్‌.వి.రంగ రామానుజాచార్యులు (ఆధ్యాత్మిక సాహిత్యం), పుత్తా పుల్లారెడ్డి (ప్రాచీన సాహిత్యం), డా.వి.వి.రామారావు (సృజనాత్మక సాహిత్యం), టి.వి.ప్రసాద్‌ (కాల్పనిక సాహిత్యం), ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి (బాల సాహిత్యం), డా.పోనుగోటి సరస్వతి (ఉత్తమ రచయిత్రి), శైలజా మిత్ర (ఉత్తమ రచయిత్రి), డా.ఎ.వి.వీరభద్రాచారి (వచన కవి), కొరుప్రోలు మాధవరావు (తెలుగు గజల్‌), జి.వి.కృష్ణమూర్తి (పద్య రచన), డా.మాదిరాజు బ్రహ్మానందరావు (పద్య రచన), డా.పసునూరి రవీందర్‌ (కథ), వేముల ప్రభాకర్‌ (నవల), ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు (హాస్య రచన), తాళ్లపల్లి మురళీధర గౌడ్‌ (వివిధ ప్రక్రియలు), వి.బి.వెంకటరమణ (జనరంజక విజ్ఞానం), ఎస్‌.వి.రామారావు (పరిశోధన), ఎం.డి.రజియా (జానపద కళారంగం), ఘట్టమరాజు అశ్వత్థ నారాయణ (సాహిత్య విమర్శ), కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి (అవధానం)లకు కీర్తి పురస్కారాలు అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని