నకిలీ మందుల వ్యవహారంలో కంపెనీకి నోటీసులు

హనుమకొండలో నకిలీ ఔషధాల అమ్మకంపై అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఎసిడిటీకి సంబంధించి ఎక్కువ మంది రోగులు వినియోగించే ఓ ఫార్మా కంపెనీకి చెందిన రెండు బ్యాచ్‌లలో నకిలీ మందులను గుర్తించిన విషయం తెలిసిందే.

Updated : 29 Mar 2023 04:57 IST

అవి హైదరాబాద్‌కూ సరఫరా అయినట్లు సమాచారం

ఈనాడు, వరంగల్‌: హనుమకొండలో నకిలీ ఔషధాల అమ్మకంపై అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఎసిడిటీకి సంబంధించి ఎక్కువ మంది రోగులు వినియోగించే ఓ ఫార్మా కంపెనీకి చెందిన రెండు బ్యాచ్‌లలో నకిలీ మందులను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ విషయమై మంగళవారం ‘ఈనాడు’లో ‘ఎసిడిటీ ఔషధాల్లో నకిలీలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. మరింత సమాచారం కోసం ఔషధ నియంత్రణాధికారులు మంగళవారం హనుమకొండ, వరంగల్‌లలో తనిఖీలు చేసి, నమూనాలను సేకరించారు. ఈ బ్యాచ్‌ మందులు హైదరాబాద్‌కూ సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఫార్మా కంపెనీ ప్రతినిధులు హనుమకొండకు చేరుకోగా వారికి నోటీసులు ఇచ్చినట్లు హనుమకొండ ఔషధ నియంత్రణాధికారి కిరణ్‌కుమార్‌ తెలిపారు. మందులను విక్రయించే ఏజెన్సీకి సైతం నోటీసులు ఇచ్చామన్నారు. సంబంధిత ఫార్మా కంపెనీకి ఉత్తర్‌ప్రదేశ్‌లో యూనిట్‌ ఉంది. అక్కడ ఒక్కో బ్యాచ్‌కు 37 లక్షల మాత్రలు వస్తాయని, అలా నెలకు కనీసం 100 బ్యాచ్‌లను తయారు చేస్తుందని అంచనా. ఈ క్రమంలో నకిలీ మందులు ఇతర రాష్ట్రాలకు కూడా విరివిగా సరఫరా అయినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు