వేసవిలోనూ వెండి మబ్బులు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మన్యంలో భిన్నమైన వాతావరణం పర్యావరణ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది.

Published : 29 Mar 2023 05:15 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మన్యంలో భిన్నమైన వాతావరణం పర్యావరణ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. వేసవిలోనూ మబ్బులు కనువిందు చేస్తున్నాయి. ఉదయం దట్టంగా పొగమంచు కురుస్తోంది. మధ్యాహ్నం వరకూ ఎండ కాస్తోంది. ఆ తర్వాత వర్షం పడుతోంది. చెరువులవెనం, లంబసింగిలో పొగమంచును ఆస్వాదించేందుకు దూరప్రాంతాల నుంచి పర్యటకులు భారీగా వస్తున్నారు.

 న్యూస్‌టుడే, చింతపల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు