రెండో రోజూ ఈడీ కార్యాలయానికి సోమ భరత్‌

దిల్లీ మద్యం కేసు విచారణలో భాగంగా భారాస ఎమ్మెల్సీ కవిత అప్పగించిన మొబైల్‌ ఫోన్ల నుంచి వరుసగా రెండో రోజూ ఈడీ అధికారులు సమాచారం సేకరించారు.

Published : 30 Mar 2023 04:10 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసు విచారణలో భాగంగా భారాస ఎమ్మెల్సీ కవిత అప్పగించిన మొబైల్‌ ఫోన్ల నుంచి వరుసగా రెండో రోజూ ఈడీ అధికారులు సమాచారం సేకరించారు. డేటా సేకరణ సమయంలో హాజరుకావాలని ఈడీ లేఖ రాయడంతో కవిత తన ప్రతినిధిగా భారాస లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ను ఈడీ కార్యాలయానికి పంపారు. మంగళవారం సమాచారం సేకరించిన ఈడీ అధికారులు బుధవారం కూడా ఆయన సమక్షంలో మొబైల్‌ ఫోన్ల నుంచి డేటా సేకరించారు. ఉదయం 11.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్న భరత్‌ రాత్రి 7 గంటల తర్వాత బయటకు వెళ్లిపోయారు.

* దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబును ఈడీ అధికారులు బుధవారం మరోసారి విచారించారు. సుమారు మూడున్నర గంటల పాటు బుచ్చిబాబు ఈడీ కార్యాలయంలో ఉన్నా కేవలం అరగంట పాటే ఆయనను విచారించినట్లు తెలిసింది. తన వృత్తిధర్మం ప్రకారం సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చానని.. మద్యం వ్యాపారం, నగదు లావాదేవీలతో తనకు సంబంధం లేదని బుచ్చిబాబు ఈడీ అధికారులకు వివరించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని