పంట నష్టాలపై పకడ్బందీగా సర్వే

వడగళ్ల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సత్వరమే గ్రామాల వారీగా పక్కాగా సర్వేలు నిర్వహించాలని సీఎస్‌ శాంతికుమారి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

Published : 30 Mar 2023 05:20 IST

వెంటనే నివేదిక ఇవ్వాలని సీఎస్‌ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: వడగళ్ల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సత్వరమే గ్రామాల వారీగా పక్కాగా సర్వేలు నిర్వహించాలని సీఎస్‌ శాంతికుమారి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వెంటనే నివేదికలనూ సమర్పించాలని స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం ఆమె బీఆర్‌కే భవన్‌లో కరీంనగర్‌, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. మిగతా జిల్లాల కలెక్టర్లతోనూ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశానికి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, విపత్తు నిర్వహణ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలన్నారు. అనంతరం పోడు భూముల పురోగతిపై సీఎస్‌ సమీక్షించారు. పాసుపుస్తకాలు ముద్రించి పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా ఛొంగ్తు ఆమెకు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు