పాల దిగుబడిలో భారత్‌ది ప్రథమ స్థానం

పాల దిగుబడిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని, 220 మిలియన్‌ టన్నుల లీటర్లు ఉత్పత్తి చేస్తోందని జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ(ఎన్‌డీడీబీ) ఛైర్మన్‌ మీనేష్‌షా తెలిపారు.

Published : 30 Mar 2023 05:26 IST

జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ మీనేష్‌షా

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: పాల దిగుబడిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని, 220 మిలియన్‌ టన్నుల లీటర్లు ఉత్పత్తి చేస్తోందని జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ(ఎన్‌డీడీబీ) ఛైర్మన్‌ మీనేష్‌షా తెలిపారు. అమెరికా 104 మిలియన్‌ టన్నుల లీటర్లతో ద్వితీయ స్థానంలో ఉందన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సహకార డెయిరీల ప్రతినిధులతో ‘గడ్డి గింజల ఉత్పత్తి, పంపిణీ’పై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘దేశంలో 300 డెయిరీల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. పశుగ్రాసం నుంచి వినియోగదారునికి పాలు అందించే వరకు ప్రతిస్థాయిలో ఎన్‌డీడీబీ సేవలందిస్తోంది. పాల దిగుబడి పెంచేందుకు పశుగ్రాస విత్తనాలను పూర్తి రాయితీపై అందిస్తాం’ అని తెలిపారు. అనంతరం క్షేత్రస్థాయిలో పశుగ్రాస విత్తనోత్పత్తి పంటలను పరిశీలించి, రైతులకు విత్తనాలను ఉచితంగా అందజేశారు. సమావేశంలో మహిళా డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, జీఎం భాస్కర్‌రెడ్డి, ఎన్‌డీడీబీ ప్రాంతీయ అధికారి రాజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని