కార్పొరేట్ల కోసమే పెట్రో బాదుడు
దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదంటూ గతంలో తాము చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు.
2014 నుంచి ఇప్పటివరకు 45 శాతానికి పైగా ధరల పెంపు
ముడి చమురు పొదుపు ప్రయోజనం ఒకట్రెండు కంపెనీలకే..
మంత్రి కేటీఆర్ ఆరోపణ
కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ
మోదీ కఠిన ప్రధాని అని వ్యాఖ్య
ఈనాడు, హైదరాబాద్: దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదంటూ గతంలో తాము చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడిచమురు ధరలతో సంబంధం లేకుండా.. పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతోందని విమర్శించారు. ఆయనను కఠిన ప్రధానిగా కేటీఆర్ అభివర్ణించారు. ఈ మేరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన గురువారం బహిరంగ లేఖ రాశారు. 2014 నుంచి ఇప్పటివరకు 45% పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరకు రవాణా భారమై, ప్రతి వస్తువు ధర భారీగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచుకు చేరుతోందని పేర్కొన్నారు. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని ఆవేదన వెలిబుచ్చారు. సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రయోజనమంతా ఒకటి, రెండు కంపెనీలకే..
‘ఒకవైపు రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకు భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. పెట్రోల్ ధరల పెంపుతో చేస్తున్న దోపిడీపై సమాధానం ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న రూ.35 వేల కోట్ల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం ఒకటి, రెండు చమురు కంపెనీలకే దక్కిందన్నది వాస్తవం. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ధి చేసి తిరిగి విదేశాలకు అమ్ముకుంటున్న కీలకమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దాచిపెడుతోంది. అలా కంపెనీలకు వచ్చిన అడ్డగోలు లాభాలను దృష్టిలో పెట్టుకుని, దానిపై ప్రభుత్వానికి వచ్చే ‘విండ్ ఫాల్’ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విషయాన్ని గమనించాలి. కార్పొరేట్ కంపెనీలకు పన్నులు తగ్గించినా.. దేశ ప్రజలపై ధరల భారాన్ని మోపుతున్న కఠినాత్ముడు ప్రధానమంత్రి మోదీ అని ప్రజలు గుర్తుంచుకోవాలి. తెలంగాణ వంటి రాష్ట్రాలు 2014 నుంచి వ్యాట్‌ను ఒక్క రూపాయి కూడా పెంచకున్నా, కేంద్ర ప్రభుత్వం సెస్సుల పేరుతో రూ.30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టింది. పెట్రో భారం తగ్గాలంటే, భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడమే ఏకైక మార్గం’ అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Odisha Train Accident: ఏపీ ప్రయాణికులు ఎందరో?
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే.. సినీఫక్కీలో ₹50 లక్షల చోరీ!
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ