నాలుగో తేదీలోగా పంట నష్టాలపై నివేదిక

రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాలపై ఏప్రిల్‌ 4లోగా సమగ్ర నివేదికలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

Published : 31 Mar 2023 03:31 IST

కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాలపై ఏప్రిల్‌ 4లోగా సమగ్ర నివేదికలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. పంట నష్టాలకు గాను ఎకరానికి రూ.10 వేల చొప్పున సాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో దాన్ని అందించేందుకు వ్యవసాయ అధికారులతో సమగ్ర సర్వేలు నిర్వహించాలని సూచించింది. నష్టాల నమోదుకు నిర్ణీత నమూనాపత్రాన్ని జిల్లాలకు పంపించింది. అందులో సాగుదారు పేరు, తండ్రి పేరు, సామాజిక స్థితి, భూసర్వే నంబర్‌, పంట రకం, మొత్తం విస్తీర్ణం, వర్షం వల్ల ఎంత దెబ్బతిన్నది (ఎకరాల్లో), రైతుల ఫోన్‌, ఆధార్‌, బ్యాంకు ఖాతా సంఖ్యలను నమోదు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

మండల వ్యవసాయాధికారులకు గత ఏడాది కాలంగా బకాయి ఉన్న అద్దె వాహనాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికశాఖను గురువారం ఆదేశించింది. ఏడాదిలో 4 నెలల పాటు అద్దె వాహనాలను క్షేత్రస్థాయి విధుల నిర్వహణకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే వెసులుబాటు కల్పించింది. ప్రతి నెలా రూ.33 వేల చొప్పున వాహనాల అద్దెను విడుదల చేస్తోంది. కాగా ఏడాది కాలంగా ఈ మొత్తాన్ని చెల్లించడం లేదు. తాజాగా పంట నష్టాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణకు వాహనాల కొరత ఉన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే అద్దె వాహనాల బిల్లులను చెల్లించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు