చి‘వరి’కి ప్రత్యామ్నాయం

నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూర్‌ పరిధిలోని వాగులో.. సమీప రైతులు 30 వరకు బోరుబావులు ఏర్పాటు చేసుకున్నారు.

Updated : 31 Mar 2023 05:07 IST

నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూర్‌ పరిధిలోని వాగులో.. సమీప రైతులు 30 వరకు బోరుబావులు ఏర్పాటు చేసుకున్నారు. వీటి నుంచి సుమారు 100 ఎకరాల్లో వరిపంటకు నీటి తడులు అందిస్తుంటారు. వాస్తవానికి ఈ రైతులకు వారి పొలాల్లో బోరుబావులు ఉన్నాయి. ఏటా యాసంగి చివరిదశలో అక్కడ భూగర్భజలాలు ఎండిపోయి.. బోర్లు వట్టిపోతుండటంతో.. చెక్‌డ్యాం దిగువన వాగులో ఇలా ఏర్పాటు చేసుకున్నారు. వానాకాలంలో వాగులో వరద ప్రవాహం ఉన్నప్పుడు మోటార్లకు ప్లాస్టిక్‌ కవర్లు కట్టి ఉంచుతామని, నీరు తగ్గాక స్వల్ప మరమ్మతులు చేపట్టి వాడుకుంటామని చెబుతున్నారు.

న్యూస్‌టుడే, జక్రాన్‌పల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు