8 నుంచి సికింద్రాబాద్‌-మేడ్చల్‌ ఎంఎంటీఎస్‌ సేవలు

ఎంఎంటీఎస్‌ రెండోదశ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ముందుగా అనుకున్నట్లు అన్ని మార్గాల్లో కాకపోయినా.. సికింద్రాబాద్‌-మేడ్చల్‌ల మధ్య ఎంఎంటీఎస్‌ సర్వీసులు పరుగు పెట్టనున్నాయి.

Updated : 31 Mar 2023 05:13 IST

ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం!

ఈనాడు, హైదరాబాద్‌: ఎంఎంటీఎస్‌ రెండోదశ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ముందుగా అనుకున్నట్లు అన్ని మార్గాల్లో కాకపోయినా.. సికింద్రాబాద్‌-మేడ్చల్‌ల మధ్య ఎంఎంటీఎస్‌ సర్వీసులు పరుగు పెట్టనున్నాయి. ఏప్రిల్‌ 8న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారు. అదేరోజు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. తర్వాత ఎంఎంటీఎస్‌ రెండోదశను ప్రారంభిస్తారని సమాచారం. నడిచేవి ఎంఎంటీఎస్‌లే అయినా.. సబర్బన్‌ సర్వీసులుగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. ప్రధాని పర్యటన షెడ్యూలు ఒకట్రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశముంది. ఈ విషయమై సబర్బన్‌ ట్రైన్‌, బస్సు ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ కూడా మోదీకి ఈనెల 26న లేఖరాసింది. 2014లో 95 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్‌ రెండోదశ రూ.816 కోట్ల వ్యయంతో ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు వాటాల ఖర్చు, ద.మ. రైల్వే ఒకవాటా వ్యయం చేసేందుకు ఒప్పందం కుదిరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని