థర్మల్‌తో పాటు.. సౌరవిద్యుత్ తప్పనిసరి..!
థర్మల్ విద్యుత్కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా హరిత ఇంధన (గ్రీన్ ఎనర్జీ) ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
కొత్త కేంద్రాల్లో 40 శాతం ఆర్‌ఈ ఇవ్వాలి
ఏప్రిల్ 1 తరువాత ఉత్పత్తి ప్రారంభించేవాటికి వర్తింపు
ఈనాడు, హైదరాబాద్: థర్మల్ విద్యుత్కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా హరిత ఇంధన (గ్రీన్ ఎనర్జీ) ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్ 1 తర్వాత దేశంలో ఎక్కడైనా సరే విద్యుదుత్పత్తి ప్రారంభించే కొత్త థర్మల్ కేంద్రం స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంలో 40 శాతం ‘సంప్రదాయేతర ఇంధనం’ (రెన్యూవబుల్ ఎనర్జీ-ఆర్‌ఈ) ఉండాలని స్పష్టంచేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31లోగా ‘వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి’ ప్రారంభించే కొత్త థర్మల్ కేంద్రాలన్నీ తప్పనిసరిగా 2025 ఏప్రిల్ 1లోగా ఆర్‌ఈ సరఫరా ప్రారంభించాలి. దీనికోసం థర్మల్ కేంద్రానికి అనుబంధంగా సౌర లేదా పవన విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించాలి. లేదంటే 40 శాతానికి సమానమైన కరెంటు ఇతర ఆర్‌ఈ కేంద్రాల నుంచి కొని డిస్కంలకు సరఫరా చేయాలి.
యాదాద్రికి వెసులుబాటు ఇవ్వాలి...
తెలంగాణలో రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల థర్మల్ కేంద్రం.. మొదటి ప్లాంటులో 2023 డిసెంబరునాటికి విద్యుదుత్పత్తి ప్రారంభం కానున్నందున దీనికి కేంద్రం జారీచేసిన తాజా ఉత్తర్వులు వర్తిస్తాయి. కానీ 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తులో 40 శాతం ఆర్‌ఈ అంటే తప్పనిసరిగా 1600 మెగావాట్ల సౌరవిద్యుత్కేంద్రం నిర్మించాల్సి ఉంటుంది. దీనికి మరో 8 వేల ఎకరాల స్థలం కావాలి. పెట్టుబడి కూడా భారీగా అవసరం. ఈ నేపథ్యంలో యాదాద్రిని ఈ నిబంధన నుంచి మినహాయించాలని కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ‘ఈనాడు’కు చెప్పారు. కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నట్లు వివరించారు. ఇక మంచిర్యాల జిల్లా జైపూర్‌లో కొత్తగా 800 మెగావాట్ల థర్మల్‌కేంద్రం ఏర్పాటుకు సింగరేణి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో 40 శాతం కింద 320 మెగావాట్ల సౌరవిద్యుత్కేంద్రాన్ని అదనంగా నిర్మించకతప్పదు. ఉమ్మడి ఏపీ విభజన చట్టం ప్రకారం రామగుండంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రాన్ని ఎన్టీపీసీ నిర్మించాలి. ఇందులో భాగంగా తొలిదశ కింద 1600 మెగావాట్ల థర్మల్ కేంద్ర నిర్మాణాన్ని దాదాపు పూర్తిచేసింది. ఇందులో విద్యుదుత్పత్తి వచ్చే నెలలో ప్రారంభం కానుందని అంచనా. ఇది ఏప్రిల్ 1న ప్రారంభమైతే ఇందులో 40 శాతం కింద 640 మెగావాట్ల సౌరవిద్యుత్కేంద్రం నిర్మించాలి. ఎన్టీపీసీకి దేశవ్యాప్తంగా సౌరవిద్యుత్కేంద్రాలు ఉన్నందున అక్కడ ఉత్పత్తయ్యే కరెంటును ఈ కోటాలో చూపుతుందా లేక సోలార్ ప్లాంటు నిర్మిస్తుందా అనేది ఇంకా తేలలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Virupaksha: ‘విరూపాక్ష’ మీమ్స్.. ఈ వైరల్ వీడియోలు చూస్తే నవ్వాగదు!
-
Ts-top-news News
Guntur: మృతుని పేరు మీద 12 ఏళ్లుగా పింఛను
-
Movies News
Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్, ‘ఆదిపురుష్’ టీమ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
TSPSC: తప్పులు సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం
-
India News
Odisha Train Accident: చనిపోయాడనుకొని ట్రక్కులో ఎక్కించారు.. రైలు ప్రమాద ఘటనలో దారుణం