రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీలివే

తెలంగాణలో 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఎంపిక చేసింది.

Published : 31 Mar 2023 04:07 IST

9 అంశాల్లో ప్రభుత్వ ఎంపిక
నేడు బహుమతుల ప్రదానం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఎంపిక చేసింది. కేంద్రం నిర్దేశించిన 9 అంశాల్లో ప్రమాణాల ప్రాతిపదికన వీటికి పురస్కారాలివ్వాలని నిర్ణయించింది. మొత్తం 43 పంచాయతీలకు 47 పురస్కారాలు లభించాయి. ఇందులో ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా-కె పంచాయతీకి 3 విభాగాల్లో, వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం మరియపురం 2 విభాగాల్లో పురస్కారాలకు ఎంపికయ్యాయి, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా పంచాయతీకి 2 ప్రత్యేక పురస్కారాలను ప్రకటించింది. దీంతోపాటు ఈ గ్రామాలను జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ విభాగం కింద పోటీకి రాష్ట్రం తరఫున ఎంపిక చేసి, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులకు శుక్రవారం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇతర మంత్రుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరగనుంది. ఇప్పటికే మండల, జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీలను ఎంపికచేసి వాటికి పురస్కారాలను రాష్ట్ర సర్కారు అందజేసింది.


పేదరిక నిర్మూలన..

పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపుదల విభాగంలో మర్లవాయి పంచాయతీ (కుమురం భీం జిల్లా జైనూర్‌ మండలం) మొదటిస్థానంలో నిలిచింది. మందొడ్డి(జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం) ద్వితీయ స్థానం, సోలిపూర్‌(వనపర్తి జిల్లా ఘన్‌పూర్‌ మండలం) మూడోస్థానం పొందింది.


ఆరోగ్య పంచాయతీ..

1.మరియపురం(వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం), 2.గౌతంపూర్‌(భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం), 3.ముజ్గి(నిర్మల్‌ జిల్లా.., గ్రామీణ మండలం)


బాలల హిత పంచాయతీ..

1.అల్లాపూర్‌(నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం),    2.హరిదాస్‌పూర్‌(సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం), 3.శ్రీనివాస్‌నగర్‌(నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం)


నీటి సమృద్ధి..

1.కుక్‌నూర్‌ (నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం), 2.మాజిద్‌పూర్‌ (రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం), 3వ స్థానం.. నెల్లుట్ల (జనగామ జిల్లా లింగాల ఘనపురం), చాపలతండా (మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌), వెలిచాల (కరీంనగర్‌ జిల్లా రామడుగు), కామారెడ్డిగూడెం (జనగామ జిల్లా దేవరుప్పుల మండలం).


పరిశుభ్రత-పచ్చదనం..

1.ముఖ్రా-కె(ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం), 2.పర్లపల్లి(కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం), 3.సుల్తాన్‌పూర్‌ (పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం).


స్వయంసమృద్ధం..

1.గంభీరావుపేట(రాజన్న సిరిసిల్ల జిల్లా), 2.యెల్లంకి(యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం), మూడోస్థానంలో మల్లంపల్లి (ములుగు జిల్లా), మూడు చింతలపల్లి (మేడ్చల్‌ జిల్లా), డి.ధర్మారం(మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం), తిమ్మాపూర్‌(కరీంనగర్‌ జిల్లా).


సామాజికభద్రత..

1.కొంగట్‌పల్లి(మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం), 2.రైతునగర్‌(కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం), 3.గొల్లపల్లె(మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం), ముకునూరు (జయశంకర్‌ జిల్లా పలిమెల మండలం).


సుపరిపాలన విభాగం..

1.చీమల్‌దరి(వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం), 2.పాలేరు(ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం), 3.చిప్పలతుర్తి(మెదక్‌ జిల్లా నర్సాపూర్‌), ఖానాపూర్‌(నారాయణపేట జిల్లా మక్తల్‌).


మహిళాహితం

1.ఇర్కోడ్‌(సిద్దిపేట జిల్లా),  2.అయిపూర్‌ (సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌-ఎస్‌ మండలం), మూడోస్థానానికి హిమ్మత్‌రావుపేట(జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం), పెంచికలపేట(హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌ మండలం), మోహిన్‌కుంట(రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం).


ప్రత్యేక కేటగిరీలో..

పర్యావరణ, ప్రకృతి విభాగం

1.కన్హా(రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం), 2.ముఖ్రా-కె (ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం), మూడోస్థానం ఇబ్రహీంపూర్‌ (సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం), నవాబ్‌పేట(జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం), మరియపురం(వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం).


సౌరశక్తి వినియోగం

1.కన్హా (రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం), 2.ఎర్రవల్లి (సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం), 3.ముఖ్రా-కె(ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం), పంతంగి(యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం), బంజరుపల్లి(సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం). 


వీటితో పాటు రాష్ట్రంలో ఉత్తమ శిక్షణ సంస్థలుగా

1.రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఐఆర్‌డీ),

2.రాజేంద్రనగర్‌ విస్తరణ కేంద్రం(ఈటీసీ),

3.హసన్‌పర్తిలోని విస్తరణ కేంద్రాల(ఈటీసీ)ను పురస్కారాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని