సామగ్రి దొంగతనాలపై ఏపీ రాజధాని రైతుల ఆందోళన

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో విద్యుత్తు మినీ టవర్ల సామగ్రి చోరీ చేస్తున్న దొంగలను పోలీసులు వెంటనే పట్టుకోవాలంటూ గురువారం అనంతవరంలో రైతులు, మహిళలు ఆందోళన చేశారు.

Published : 31 Mar 2023 04:46 IST

తుళ్లూరు, న్యూస్‌టుడే: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో విద్యుత్తు మినీ టవర్ల సామగ్రి చోరీ చేస్తున్న దొంగలను పోలీసులు వెంటనే పట్టుకోవాలంటూ గురువారం అనంతవరంలో రైతులు, మహిళలు ఆందోళన చేశారు. అనంతవరం నుంచి తుళ్లూరు వెళ్లే రోడ్డు పక్కనున్న విద్యుత్తు టవర్‌ సామగ్రిని ఇటీవల చోరీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో వారు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు మాట్లాడుతూ.. తరచూ రాజధాని నిర్మాణ సామగ్రి చోరీ అవుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అసలు అధికారులు ఉన్నారో? లేరో? అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం అమరావతిని నిర్మించకపోగా.. సామగ్రి దోచుకుపోతుంటే చోద్యం చూస్తోందని విమర్శించారు. గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న విద్యుత్తు టవర్‌ను వాహనాల్లో వేసుకొని తీసుకెళుతున్నా పట్టించుకునే నాథుడే లేరని ధ్వజమెత్తారు. ఉద్యమిస్తున్న మహిళలపై లాఠీఛార్జి చేయడానికి ముందుండే పోలీసులు.. దొంగలను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారని మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు