ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల వేగవంతానికి అంతర్జాతీయ సహకారం

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో నూతన ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి క్వాల్‌కామ్‌ అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది.

Published : 01 Apr 2023 04:02 IST

టి-వర్క్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న క్వాల్‌కామ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో నూతన ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి క్వాల్‌కామ్‌ అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. ప్రత్యేకమైన బహుళ పొరల ప్రింటెండ్‌ సర్క్యూట్‌ బోర్డు(మల్టీ లేయర్‌ పీసీబీ) ఫ్యాబ్రికేషన్‌ సదుపాయాన్ని అభివృద్ధి చేయడానికి టి-వర్క్స్‌తో క్వాల్‌కామ్‌ ఇండియా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై శుక్రవారం టి-వర్క్స్‌ సీఈవో సుజయ్‌, క్వాల్‌కామ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శశిరెడ్డి సంతకాలు చేశారు. భారత్‌లో డిజైన్‌, ఇన్నోవేషన్‌ను అభివృద్ధి చేయడంలో చేపట్టిన కార్యక్రమాలకు క్వాల్‌కామ్‌ మద్దతుగా నిలవడంతో పాటు పీసీబీ ఫ్యాబ్రికేషన్‌లో అవసరమైన అన్ని రకాల పరికరాలను అందించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని