బిల్డర్స్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడుగా ఎస్‌ఎన్‌ రెడ్డి

బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన శ్రీపతి నరసింహారెడ్డి (ఎస్‌ఎన్‌ రెడ్డి) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

Published : 01 Apr 2023 04:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన శ్రీపతి నరసింహారెడ్డి (ఎస్‌ఎన్‌ రెడ్డి) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఏటా అసోసియేషన్‌కు నిర్వహించే ఎన్నికల్లో 2023-24 సంవత్సరానికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబయిలోని అసోసియేషన్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు నిమేష్‌ పటేల్‌ నుంచి ఎస్‌ఎన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.తమ అసోసియేషన్‌ దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఏర్పడిందన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అన్ని రాష్ట్రాల అసోసియేషన్‌ ప్రతినిధులకు ఈ సందర్భంగా ఎస్‌ఎన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు