96 లక్షల మందికి కంటి పరీక్షలు

రాష్ట్రంలో కంటివెలుగు కార్యక్రమంలోఇప్పటివరకు 96 లక్షల మందికి కంటి పరీక్షలు చేసినట్లు వైద్యారోగ్య శాఖ శుక్రవారం తెలిపింది.

Published : 01 Apr 2023 04:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కంటివెలుగు కార్యక్రమంలోఇప్పటివరకు 96 లక్షల మందికి కంటి పరీక్షలు చేసినట్లు వైద్యారోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా జనవరి 18న ప్రారంభించిన రెండో విడత  కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొంది. ఇప్పటివరకు 15.65 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసెస్‌ను పంపిణీ చేశామని, చూపు సమస్యలతో ఉన్న 11.68 లక్షల మందికి సంబంధిత అద్దాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని