జాతీయ రహదారి-163జీకి రూ.2,235.08 కోట్లు: కేంద్ర మంత్రి గడ్కరీ

వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాలను కలుపుతూ నాలుగు వరుసలతో నిర్మించనున్న జాతీయ రహదారి-163జీకి రూ.2,235.08 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

Published : 01 Apr 2023 04:00 IST

ఈనాడు, దిల్లీ: వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాలను కలుపుతూ నాలుగు వరుసలతో నిర్మించనున్న జాతీయ రహదారి-163జీకి రూ.2,235.08 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో మహబూబాబాద్‌ జిల్లా తాళ్ల సంకీస నుంచి ఖమ్మం జిల్లా వి.వెంకటాయపాలెం మధ్య నాలుగు వరుసల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి (ఎన్‌హెచ్‌-163జీ) నిర్మాణానికి రూ.1123.32 కోట్లు మంజూరు చేసినట్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ట్వీట్‌ చేశారు. 30.830 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణాన్ని హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇదే రహదారి కొనసాగింపుగా వరంగల్‌ జిల్లా వెంకటాపూర్‌ నుంచి మహబూబాబాద్‌ జిల్లా తాళ్ల సంకీస వరకు 39.410 కిలోమీటర్ల మేర నిర్మాణానికి రూ.1111.76 కోట్లకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు