మావోయిస్టు యాక్షన్‌ టీం కమాండర్‌ లొంగుబాటు

మావోయిస్టు పార్టీ యాక్షన్‌ టీం కమాండర్‌, ఏరియా కమిటీ సభ్యుడు మిడియం జోగయ్య అలియాస్‌ జంగు శుక్రవారం ములుగు జిల్లా ఓఎస్డీ అశోక్‌కుమార్‌ ఎదుట లొంగిపోయాడు.

Published : 01 Apr 2023 04:49 IST

ములుగు, న్యూస్‌టుడే: మావోయిస్టు పార్టీ యాక్షన్‌ టీం కమాండర్‌, ఏరియా కమిటీ సభ్యుడు మిడియం జోగయ్య అలియాస్‌ జంగు శుక్రవారం ములుగు జిల్లా ఓఎస్డీ అశోక్‌కుమార్‌ ఎదుట లొంగిపోయాడు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. 2016లో అప్పటి మిలీషియా కమాండర్‌ ప్రోత్సాహంతో జోగయ్య మావోయిస్టు పార్టీలో చేరాడని తెలిపారు. చర్ల ఎస్జీఎస్‌ సభ్యుడిగా, దామోదర్‌ భద్రతా బృంద సభ్యుడిగా వ్యవహరించాడని పేర్కొన్నారు. తర్వాత యాక్షన్‌ టీం కమాండర్‌గా 2022 ఆగస్టు వరకు పనిచేశాడని వివరించారు. ఇతడిపై మొత్తం నాలుగు కేసులున్నాయని తెలిపారు. మావోయిస్టు భావజాలం పట్ల విరక్తి చెంది జోగయ్య లొంగిపోయాడని అశోక్‌కుమార్‌ చెప్పారు. ప్రభుత్వం తరఫున చేసే ఆర్థిక సాయాన్ని జోగయ్యకు ఓఎస్డీ అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు