అదానీ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత

వేతనాలు పెంచాలని డిమాండు చేస్తూ విశాఖపట్నంలోని అదానీ గంగవరం పోర్టు కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వివిధ విభాగాల కార్మికులు గేటు లోపల బైఠాయించి నినాదాలు చేశారు.

Published : 01 Apr 2023 04:49 IST

వేతనాలు పెంచాలని కార్మికుల ఆందోళన

విశాఖపట్నం (గాజువాక), న్యూస్‌టుడే: వేతనాలు పెంచాలని డిమాండు చేస్తూ విశాఖపట్నంలోని అదానీ గంగవరం పోర్టు కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వివిధ విభాగాల కార్మికులు గేటు లోపల బైఠాయించి నినాదాలు చేశారు. కార్మికుల శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని, ఉద్యోగభద్రత కల్పించాలని, బోనస్‌ ఇవ్వాలని కోరారు. పి.నూకరాజు అనే కార్మికుడు డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా న్యూపోర్టు పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. 2009లో విధుల్లో చేరామని, అప్పట్నుంచి ఇప్పటివరకు రూ.8,300-రూ.14,600 వరకు మాత్రమే వేతనాలు పెంచారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతి కార్మికుడికి రూ.36వేల వేతనం చెల్లించాలని, లేకపోతే వీఆర్‌ఎస్‌ ప్రకటించి ఒక్కో కార్మికుడికి రూ.50లక్షల వరకు పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. కార్మికులకు స్థానిక అఖిలపక్ష పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా విధుల నుంచి తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవాలని, ఏటా 20% బోనస్‌ చెల్లించాలని, ప్రత్యేక మెడికల్‌ పాలసీ ప్రకటించాలని.. తదితర 11 డిమాండ్లను యాజమాన్యం ముందుంచారు. పోర్టు యాజమాన్య ప్రతినిధులతో అఖిలపక్ష నాయకులు, పోర్టు కార్మికసంఘాల నాయకులు చర్చలు కొనసాగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని