అడవుల రక్షణకు పెద్దపులుల సంరక్షణ అవసరం

అడవుల రక్షణకు పెద్దపులుల సంరక్షణ అవసరమని రాజ్యసభ ఎంపీ, అడవులు, పర్యావరణంపై పార్లమెంట్‌ స్థాయీ సంఘం సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ తెలిపారు.

Updated : 02 Apr 2023 04:58 IST

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: అడవుల రక్షణకు పెద్దపులుల సంరక్షణ అవసరమని రాజ్యసభ ఎంపీ, అడవులు, పర్యావరణంపై పార్లమెంట్‌ స్థాయీ సంఘం సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ తెలిపారు. ప్రాజెక్ట్‌ టైగర్‌కు యాభై ఏళ్లు నిండిన సందర్భంగా దాని ప్రాధాన్యాన్ని శనివారం ఎంపీ ట్విటర్‌ ద్వారా వివరించారు. సేవ్‌ టైగర్‌ ఉద్యమంపై అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు అధికారులు విడుదల చేసిన పుస్తకం, టీ షర్ట్‌, కాఫీ మగ్‌ సావనీర్లను జతచేశారు. ‘పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పెద్దపులి అగ్రభాగాన నిలుస్తుంది. దేశవ్యాప్తంగా అడవుల రక్షణ, పులుల సంరక్షణకు కేంద్రం 1973లో ప్రాజెక్ట్‌ టైగర్‌ను ప్రారంభించింది. దీని కింద తీసుకున్న చర్యలతో అప్పట్లో 1,827గా ఉన్న పులుల సంఖ్య... 2022 నాటికి 2,967కు చేరుకుంది. పులుల సంరక్షణ ప్రాంతాల సంఖ్య 53కు పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖ ద్వారా అమ్రాబాద్‌, కవ్వాల్‌ పులుల అభయారణ్యాలను చక్కగా నిర్వహిస్తోంది. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ తరఫున పులుల రక్షణకు మా మద్దతు ఉంటుంది. కొత్త తరాలకు పులులను కాపాడాల్సిన బాధ్యతను అందించాలి’ అని పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు