పెంచిన టోల్‌గేట్‌ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి

దేశవ్యాప్తంగా కేంద్రం పెంచిన టోల్‌గేట్‌ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు బి.నందారెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 02 Apr 2023 03:32 IST

విజయవాడ జాతీయ రహదారిపై లారీ యజమానుల సంఘం నిరసన

వనస్థలిపురం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా కేంద్రం పెంచిన టోల్‌గేట్‌ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు బి.నందారెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్రం 5.5 శాతం టోల్‌ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సంఘం ఆధ్వర్యంలో శనివారం వనస్థలిపురంలోని ఆటోనగర్‌ ఇసుక లారీల అడ్డా వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నందారెడ్డి మాట్లాడుతూ.. కరోనా ప్రభావంతో ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న లారీల యజమానులపై ఇంధన ధరల భారం, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్సులు, ఇప్పుడు టోల్‌ ఛార్జీల బాదుడు అదనపు భారం మోపుతున్నాయన్నారు. లారీ యజమానులు ప్రధానంగా ఎదుర్కొంటున్న డీజిల్‌ ధరలను పరిష్కరించటానికి వీలుగా వాటిని వెంటనే జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోరారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో డీజిల్‌ ధర లీటరుకు ఇక్కడికన్నా రూ.12 తక్కువగా ఉందన్నారు. తెలంగాణ సర్కారు వ్యాట్‌ను సవరించి లారీల యజమానులపై భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల అనుచిత వైఖరి వల్ల లారీ యజమానులు తీవ్ర నష్టాల్లోకి వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి, సుర్వి యాదయ్యగౌడ్‌, రాంరెడ్డి, ఆటోనగర్‌ సంఘం అధ్యక్షుడు రాజుగౌడ్‌, శ్రీశైలం, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని