వైభవంగా భద్రాద్రి రామయ్య రథోత్సవం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల వైభవాన్ని తిలకించి తరించిన భక్తకోటికి శనివారం ఉదయం నిర్వహించిన రథోత్సవం కనులపండువ చేసింది.

Published : 02 Apr 2023 03:32 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల వైభవాన్ని తిలకించి తరించిన భక్తకోటికి శనివారం ఉదయం నిర్వహించిన రథోత్సవం కనులపండువ చేసింది. శ్రీరామ నామాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. రథం లాగేందుకు భక్తులు అమితాసక్తి చూపారు. రాజవీధిలో అడుగడుగునా మహిళలు హారతులు అందించి జగదేకవీరుడు రామయ్యను ఘనంగా ఆహ్వానించారు. శుక్రవారం రాత్రి రథోత్సవ సంబరాన్ని నిర్వహించాల్సి ఉండగా వర్షం కారణంగా వాయిదా పడింది. శనివారం ఉదయం రథం కొద్దిదూరం కదలగానే వర్షం పడినప్పటికీ వేడుకను కొనసాగించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సీతారాములకు వైదిక బృందం వేదాశీర్వచనం పలికింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని