జరీన్‌కు ఘన స్వాగతం

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో వరుసగా రెండోసారి బంగారు పతకం సాధించిన నిఖత్‌ జరీన్‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో శనివారం ఘన స్వాగతం లభించింది.  

Published : 02 Apr 2023 03:32 IST

హిళల ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో వరుసగా రెండోసారి బంగారు పతకం సాధించిన నిఖత్‌ జరీన్‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో శనివారం ఘన స్వాగతం లభించింది.  ట్రోఫీతో వచ్చిన ఆమెను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో బాక్సింగ్‌ అకాడమీని ఏర్పాటు చేసి ప్రపంచ బాక్సింగ్‌ క్రీడాకారులను తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్‌ కార్యాచరణ రూపొందిస్తున్నారని అన్నారు. ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో సత్తా చాటడమే తన లక్ష్యమని నిఖత్‌ జరీన్‌ పేర్కొన్నారు. 

 న్యూస్‌టుడే, శంషాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని