శ్రీశైలంలో రికార్డు స్థాయి విద్యుదుత్పత్తి

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం ఈగలపెంటలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రం (ఎస్‌ఎల్‌బీహెచ్‌ఈఎస్‌)లో శనివారం రికార్డు స్థాయి విద్యుదుత్పత్తి సాధించారు.

Updated : 02 Apr 2023 05:27 IST

ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో 2165 మిలియన్‌ యూనిట్లు

శ్రీశైలం ప్రాజెక్టు (అమ్రాబాద్‌), న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం ఈగలపెంటలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రం (ఎస్‌ఎల్‌బీహెచ్‌ఈఎస్‌)లో శనివారం రికార్డు స్థాయి విద్యుదుత్పత్తి సాధించారు. ఈ సందర్భంగా భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలో అధికారులు, సిబ్బంది, కార్మికులు మిఠాయిలు పంచుకొని ఆనందం వెలిబుచ్చారు. కేకు కోసి వేడుక నిర్వహించారు. 2022-23 సంవత్సరానికి రికార్డు స్థాయిలో 2164.599 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని సీఈ సూర్యనారాయణ తెలిపారు. మొత్తం ఆరు యూనిట్లు ఉండగా గతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని యూనిట్లు దెబ్బతిన్నాయి. పూర్తిగా పాడైన నాలుగో యూనిట్‌ మినహా మిగిలిన వాటికి మరమ్మతులు చేసి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. అయిదు యూనిట్ల ద్వారా రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీఈ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని