TS Eamcet: ఎంసెట్‌ దరఖాస్తుకు మిగిలింది నాలుగు రోజులే

ఎంసెట్‌కు ప్రతి 100 మందిలో ముగ్గురు ఆలస్య రుసుంతోనే దరఖాస్తు చేసుకున్నారు. రూ.250 నుంచి రూ.5 వేల వరకు అదనంగా చెల్లిస్తుండటం గమనార్హం.

Updated : 29 Apr 2023 09:11 IST

ప్రతి వంద మందిలో ముగ్గురు ఆలస్య రుసుంతోనే..

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌కు ప్రతి 100 మందిలో ముగ్గురు ఆలస్య రుసుంతోనే దరఖాస్తు చేసుకున్నారు. రూ.250 నుంచి రూ.5 వేల వరకు అదనంగా చెల్లిస్తుండటం గమనార్హం. రూ.5 వేలతో ఇప్పటివరకు 59 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 8,394 మంది ఆలస్య రుసుంతో పరీక్ష రాయడానికి ముందుకొచ్చారు. మే 10 నుంచి 15 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 10నే గడువు ముగియగా.. మే 2 వరకు అపరాధ రుసుముతో అవకాశం ఉంది. శుక్రవారం వరకు మొత్తం 3,19,947 మంది దరఖాస్తు చేసుకున్నారని ఎంసెట్‌ కోకన్వీనర్‌ ఆచార్య విజయకుమార్‌రెడ్డి తెలిపారు. వారిలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ రెండు పరీక్షలూ రాసేవారు 372 మంది ఉన్నారు. ఇంజినీరింగ్‌కు హాజరయ్యే 1,53,676 మందిలో 1.08 లక్షల మంది హైదరాబాద్‌లోనే పరీక్ష రాయనున్నారు. అగ్రికల్చర్‌లోనూ 94,470 మందికి గాను 63,730 మంది నగరంలోనే హాజరవనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని