Sri Lakshmi Narasimha Swamy Temple: యాదాద్రిలో నిత్యకల్యాణం నిలిపివేత

యాదాద్రి పుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి శ్రీనరసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో రోజువారీగా జరిగే శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం, శ్రీసుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి గీత తెలిపారు.

Updated : 30 Apr 2023 10:01 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి శ్రీనరసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో రోజువారీగా జరిగే శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం, శ్రీసుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి గీత తెలిపారు. మొక్కు కల్యాణం నిర్వహించే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఉత్సవాలు పూర్తయిన తరవాత మే 5వ తేదీ నుంచి నిత్యకల్యాణం, హోమం, బ్రహ్మోత్సవాలు పునఃప్రారంభమవుతాయని వివరించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ మే 2 నుంచి 4వ తేదీ వరకు నిత్యకల్యాణం నిలిపివేస్తున్నట్లు ఈవో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని