రేపట్నుంచి పలు రైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

దక్షిణ మధ్య రైల్వే ఈనెల 21 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.

Published : 20 May 2023 08:46 IST

మూడో లైను పనులే కారణం: దక్షిణ మధ్య రైల్వే

డోర్నకల్‌ (మహబూబాబాద్‌), న్యూస్‌టుడే: దక్షిణ మధ్య రైల్వే ఈనెల 21 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. కాజీపేట-కొండపల్లి సెక్షన్‌లోని చింతలపల్లి, నెక్కొండ రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. రద్దయిన రైళ్లలో మెమూ రైళ్లతో పాటు కాకతీయ, శాతవాహన సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది.  

రద్దయిన రైళ్లు

* ఈనెల 21 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు కాజీపేట-డోర్నకల్‌ (07753), డోర్నకల్‌-కాజీపేట (07754), విజయవాడ-డోర్నకల్‌ (07755), డోర్నకల్‌-విజయవాడ (07756) మెమూ రైళ్లు, భద్రాచలం రోడ్‌-సికింద్రాబాద్‌(17660), సికింద్రాబాద్‌-భద్రాచలం రోడ్‌(17659) కాకతీయ ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ-సికింద్రాబాద్‌(12713), సికింద్రాబాద్‌-విజయవాడ(12714) శాతవాహన సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌.

* ఈనెల 23, 30, జూన్‌ 6 తేదీలలో కాజీపేట-తిరుపతి (07091), తిరుపతి-కాజీపేట (07092) తిరుపతి స్పెషల్‌ ఫేర్‌ ఎక్స్‌ప్రెస్‌..

* ఈనెల 21, 28, జూన్‌ 4 తేదీలలో మచిలీపట్నం-సికింద్రాబాద్‌ (07185), సికింద్రాబాద్‌-మచిలీపట్నం (07186) మచిలీపట్నం స్పెషల్‌ ఫేర్‌ ఎక్స్‌ప్రెస్‌..  

పాక్షికంగా రద్దయినవి

* ఈనెల 20 నుంచి జూన్‌ 6 వరకు సిర్పూర్‌ టౌన్‌-భద్రాచలం రోడ్‌(17034) సింగరేణి ఎక్స్‌ప్రెస్‌.. వరంగల్‌-భద్రాచలం రోడ్‌ మధ్య రద్దు.

* ఈనెల 21 నుంచి జూన్‌ 7 వరకు భద్రాచలం రోడ్‌-బలార్షా(17033) సింగరేణి ఎక్స్‌ప్రెస్‌.. భద్రాచలం రోడ్‌-వరంగల్‌ మధ్య రద్దు.

* ఈనెల 20 నుంచి జూన్‌ 6 వరకు బెళగవి-మణుగూరు(07335) బెళగవి ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట-మణుగూరు మధ్య రద్దు.

* ఈనెల 21 నుంచి జూన్‌ 7 వరకు మణుగూరు-బెళగవి(07336) బెళగవి ఎక్స్‌ప్రెస్‌ మణుగూరు-కాజీపేట మధ్య రద్దు.

గోల్కొండ రీషెడ్యూల్‌

* ఈనెల 23, 25, 27, 28, 30, జూన్‌ 1, 3, 4, 7 తేదీల్లో గుంటూరు-సికింద్రాబాద్‌ మధ్య నడిచే నంబరు 17201 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైలును రీ-షెడ్యూల్‌ చేశారు.
నెక్కొండలో ఆగని రైళ్లు

* డోర్నకల్‌-వరంగల్‌ మార్గంలోని వరంగల్‌ జిల్లా నెక్కొండ స్టేషన్‌లో ఈనెల 21 నుంచి 28 వరకు తిరుపతి-ఆదిలాబాద్‌ (17405) కృష్ణా ఎక్స్‌ప్రెస్‌, 27,28 తేదీలలో ఆదిలాబాద్‌-తిరుపతి (17406) కృష్ణా ఎక్స్‌ప్రెస్‌, 28న సికింద్రాబాద్‌-తిరుపతి (12764) పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, 27,28 తేదీలలో లింగంపల్లి-కాకినాడ పోర్టు(12738) గౌతమి ఎక్స్‌ప్రెస్‌.

* 22 నుంచి 28 వరకు గుంటూరు-సికింద్రాబాద్‌ (17201) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, 27,28 తేదీలలో సికింద్రాబాద్‌-గుంటూరు (17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ఆగదు.
దారి మళ్లింపు
* ఈనెల 21 నుంచి జూన్‌ 7 వరకు విశాఖ-ఎల్‌టీటీ (18519).. గుంటూరు మీదుగా వెళుతుంది.

* ఈనెల 24, 31 తేదీలలో షాలిమార్‌-సికింద్రాబాద్‌(22849).. గుంటూరు మీదుగా నడుస్తుంది.

* ఈనెల 21, 28, జూన్‌ 4 తేదీల్లో యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌(18112).. గుంటూరు మీదుగా మళ్లింపు.

* ఈనెల 28, జూన్‌ 7 తేదీలలో హైదరాబాద్‌-షాలిమార్‌(18046) ఈస్టుకోస్టు.. గుంటూరు మీదుగా ప్రయాణిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని