గిరిజనుల సమస్యలను ప్రాధాన్య అంశంగా పరిష్కరించాలి: తమిళిసై

ఏళ్లుగా అభివృద్ధిలో వెనుకబాటుకు గురవుతున్న ఆదివాసీ గిరిజనుల సమస్యలను ప్రాధాన్య ప్రాతిపదికన పరిష్కరించాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు.

Published : 20 May 2023 04:11 IST

రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో జాతీయ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: ఏళ్లుగా అభివృద్ధిలో వెనుకబాటుకు గురవుతున్న ఆదివాసీ గిరిజనుల సమస్యలను ప్రాధాన్య ప్రాతిపదికన పరిష్కరించాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. వివిధ స్థాయుల్లోని పరిపాలనాధికారులు గిరిజనులపై సానుభూతితో వ్యవహరించాలని.. ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. జాతీయ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ హర్ష చౌహాన్‌, సభ్యుడు ఆనంద్‌ నాయక్‌లు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పలువురు ఆదివాసీ గిరిజనుల ప్రతినిధులు జాతీయ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌కు తమ సమస్యలను వివరించారు. స్థానిక గిరిజన జాతరలకు నిధులు పెంచాలని.. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, భూమి పట్టాలు పంపిణీ జరిగేలా చూడాలని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు గవర్నర్‌కు, ఎస్టీ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. తమిళిసై మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 200 పడకల ఆధునిక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారని ప్రస్తావించారు. హర్ష్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. స్థానిక భాషలో పాఠ్యపుస్తకాలను సిద్ధం చేయడానికి చర్యలు ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇవ్వనున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు