సమన్వయంతో సీఎం కప్‌ నిర్వహణ

జిల్లా స్థాయిలో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే క్రీడా పోటీలను ఆ జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ల సమన్వయంతో జయప్రదం చేయాలని క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు.

Published : 20 May 2023 05:04 IST

సమీక్షలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లా స్థాయిలో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే క్రీడా పోటీలను ఆ జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ల సమన్వయంతో జయప్రదం చేయాలని క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. సీఎం కప్‌-2023 రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాల నిర్వహణపై సచివాలయంలో శుక్రవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి పోటీలను ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. మండల స్థాయిలో క్రీడా ప్రాంగణాలను గుర్తించి వాటిని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ పర్యవేక్షణలోకి తీసుకురావాలని అధికారుల్ని ఆదేశించారు. సీఎం కప్‌లో 18 క్రీడాంశాల నిర్వహణలో ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు కీలక భూమిక పోషించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు రసమయి బాలకిషన్‌, జూలూరి గౌరీశంకర్‌, ఆంజనేయ గౌడ్‌, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, టూరిజం కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, జాతీయ హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ జగన్మోహన్‌రావు, రాష్ట్ర ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ప్రేమ్‌రాజ్‌ పాల్గొన్నారు.

ప్రపంచస్థాయికి తెలంగాణ పర్యాటకం

రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలని పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులకు సూచించారు. తమ కార్యాలయంలో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ, జిల్లా స్థాయుల్లో స్థానిక పర్యాటకంపై సమన్వయం చేస్తూ విద్యార్థులకు తెలంగాణ పర్యాటకం పట్ల అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు