తెలంగాణ కానిస్టేబుల్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదల

కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నిర్వహించిన తుది పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది.

Updated : 22 May 2023 05:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నిర్వహించిన తుది పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది. సోమవారం ఉదయం నుంచి నియామక మండలి వెబ్‌సైట్‌ ‌www.tslprb.in లో అందుబాటులో ఉంటుంది. పోలీసుశాఖలోని వివిధ విభాగాలతోపాటు ఆబ్కారీ, రవాణాశాఖల్లో కానిస్టేబుళ్ల భర్తీకి గత నెలలో తుది పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో డ్రైవర్లు, మెకానిక్‌ల వంటి కానిస్టేబుల్‌ సమానస్థాయి పోస్టులూ ఉన్నాయి. ఆయా విభాగాల వారీగా తుది పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులకు ఏవైనా ప్రశ్నలకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వెబ్‌సైట్లోనే తెలుపవచ్చు. ఒక్కో అభ్యంతరానికి ఒక్కో టెంప్లెట్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. తమ అభ్యంతరాన్ని ధ్రువీకరించే ఆధారాలను కూడా అందులోనే అప్‌లోడ్‌ చేయొచ్చు. ఈ నెల 24 వరకూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని