Telangana News: రాళ్లూరప్పల దారి.. ఆపసోపాలతో సవారీ!

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం మాలిని గ్రామపంచాయతీ పరిధిలోని మానిక్‌పటార్‌కు రహదారి సౌకర్యం కరవైంది.

Updated : 22 May 2023 08:05 IST

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం మాలిని గ్రామపంచాయతీ పరిధిలోని మానిక్‌పటార్‌కు రహదారి సౌకర్యం కరవైంది. దీంతో ఈ గ్రామంలోని 30 గిరిజన కుటుంబాలు గుట్టల మధ్య, రాళ్లూరప్పలు కల రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తూ నరకయాతన అనుభవిస్తున్నాయి. సరకులు, ఇతర పనుల కోసం కాగజ్‌నగర్‌ మండల కేంద్రానికి గానీ, ఇతర ప్రాంతాలకు గానీ వెళ్లడానికి 3 కిలోమీటర్ల ఈ దారే ఆధారం. రాళ్లూరప్పల మార్గంలో గుట్ట దిగి ఊట్‌పల్లి వరకు కాలినడకన, ఎడ్లబండ్లపై రాకపోకలు సాగిస్తుంటారు. అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని కాగజ్‌నగర్‌కు ఆటోల్లో వచ్చివెళ్తుంటారు. మానిక్‌పటార్‌కు రహదారి సౌకర్యం కల్పించాలని ఉట్నూరు ఐటీడీఏ అధికారులకు విన్నవించినా.. అటవీ శాఖ అనుమతులు లేక నిధులు మంజూరవడం లేదని మాలిని సర్పంచి భగవంతరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

న్యూస్‌టుడే, కాగజ్‌నగర్‌ గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని