సాహితీ డైరెక్టర్‌ ఇంట్లో సోదాలు

స్థిరాస్తి వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడ్డ సాహితీ సంస్థ డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు ఇల్లు, కార్యాలయాల్లో సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.

Published : 23 May 2023 04:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తి వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడ్డ సాహితీ సంస్థ డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు ఇల్లు, కార్యాలయాల్లో సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఇళ్లు నిర్మించి ఇస్తామని చెబుతూ ప్రీలాంచింగ్‌ ఆఫర్ల పేర్లతో సాహితీ సంస్థ పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసింది. కానీ ఇళ్లనిర్మాణం పూర్తిచేసి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్లతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ప్రజల నుంచి రూ.2 వేల కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల అంచనా. వీటి నుంచి పెద్దమొత్తంలో నిధులు మళ్లించి ఉంటారన్న అనుమానంపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది.  సోదాల్లో ఈడీ అధికారులు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు