అమరుల స్మారకం.. వెలుగొందె జ్ఞాపకం

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయం ఎదురుగా సుమారు 3.29 ఎకరాల్లో స్మారక భవనం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Published : 24 May 2023 04:27 IST

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయం ఎదురుగా సుమారు 3.29 ఎకరాల్లో స్మారక భవనం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ నాలుగు అంతస్తుల కేంద్రం భాగ్యనగర పర్యాటక కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా చేరబోతోంది. తాజాగా ఇక్కడ నిరంతరం వెలిగే అమరజ్యోతిని ఏర్పాటు చేశారు. ప్రమిద ఆకారంలో భవనాన్ని నిర్మించి విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. ఇది చూడటానికి మండుతున్న జ్యోతిలా కనిపిస్తోంది. ఆ వెలుగుల్లో మంగళవారం రాత్రి సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ ప్రాంతాలు కనిపించాయి ఇలా.

 ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని