రెండేళ్లుగా సీఎంఆర్‌ ఇవ్వని మిల్లర్లకు జరిమానా

రెండేళ్లుగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ఇవ్వని మిల్లర్ల నుంచి జరిమానా వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Published : 24 May 2023 04:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: రెండేళ్లుగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ఇవ్వని మిల్లర్ల నుంచి జరిమానా వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2021-22 వానాకాలం సీజన్‌కి సంబంధించి 494 మంది మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యాన్ని అప్పగించలేదు. 2.22 లక్షల టన్నుల బియ్యం వారి వద్దే ఉంది. ఒప్పంద నిబంధనల ప్రకారం ఈ మిల్లర్ల నుంచి 125 శాతం జరిమానా వసూలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. 25% నగదు లేదా మరో రూపంలో చెల్లించాలని.. 100% సీఎంఆర్‌ని వడ్డీతో నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించాలని పేర్కొంది. 2023-24 వానాకాలం సీజన్‌లోపు బకాయి ఉన్న కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ని 100% అప్పగించాలని స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని